ఏపీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు క సలహా ఇచ్చారు. అధునాత కందుకూరి విరేశలింగం పంతులుగా ఫీలు కావొద్దని ఆయన సలహా ఇచ్చారు. ఆయన ఢిల్లీలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, తాను వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే శత్రువు అన్నారు. అంతేకానీ, నరసాపురం లోక్‌సభకు వైకాపా అభ్యర్థిగా ఉమాబాల లేకా మరో అభ్యర్థితో తనకు శత్రుత్వం లేదన్నారు. తనపై పోటీకి రోజుకో అభ్యర్థి పేరు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
సొంత చెల్లిని, తల్లిని తిట్టించం ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు. కుటుంబ సభ్యులను తిట్టించడాన్ని ముందు జగన్ ఆపాలన్నారు. అలాగే, కుటుంబంలోని మహిళలకు మర్యాద ఇవ్వడం జగన్ నేర్చుకోవాలని, ఆ తర్వాతే మహిళా సాధికారిత గురించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు.
కాగా, ఏపీకి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టును 2023లోనే పూర్తి చేస్తామని సీఎం జగన్, ఆయన మంత్రివర్గ సహచరులు పదేపదే చెప్పారన్నారు. కానీ, ఇపుడు 2024 జనవరి నెల కూడా గడిచిపోయిందన్నారు. అవినీతి తావు లేకుండా పోలవరంను పూర్తి చేస్తామని జగన్ ఇపుడు కూడా చెబుతున్నారని, ఇలాంటి నటుడిని తాను ఇంతవరకు చూడలేదని చెప్పారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయలేని జగన్.. పోలవరం ప్రాజెక్టు ఎలా కడతారని ట్రిపుల్ ఆర్ ఎద్దేవా చేశారు.