మైలవరం నియోజకవర్గంలోని కార్యకర్తలతో కలిసి చంద్రబాబుకు వద్దకు వెళ్తానని చెప్పారు. పైగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుతో తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలు, విభేదాలు లేవన్నారు. పార్టీ హైకమాండ్ సమక్షంలో ఇద్దరం కలిసి అన్నీ మాట్లాడుకుంటామని ఆయన చెప్పారు.
అదేసమయంలో ఆయన వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, నారా లోకేశ్‌లను వ్యక్తిగతంగా దూషించాలని జగన్ చెప్పారని ఆరోపించారు. మైలవరం టిక్కెట్ ఇస్తానని చెబుతూనే వారిని తిట్టాలని అన్నారని చెప్పారు. వైకాపాలో ఉండలేకే టీడీపీ చేరుతున్నానని తెలిపారు. విపక్ష నేతలను తిట్టేవారికే వైకాపాలో సీట్లు ఇస్తారని ఆయన అన్నారు.