ఆయన మాట్లాడుతూ... నేను ఎక్కడ అభివృద్ధి పనులు, ప్రజలకు సేవ చేసినా నా సొంత డబ్బులు, కష్టార్జితమే పెట్టాను. చూసి వచ్చేవాళ్లు చాలామంది వుంటారు. కానీ చేసేవాళ్లు చాలా తక్కువగా వుంటారు. నేను ఖాళీ చేతులతో వెళ్లను, ఏదో ఒకటి చేస్తాను. బొలిశెట్టి వెళ్లిన ఏ నియోజకవర్గంలో అడిగినా చెబుతారు.
నేను ఓ సాధారణ రైతు కొడుకును. మా నాన్న ఆర్టీసి డ్రైవర్. 4 ఎకరాల భూమి వుండేది. ముగ్గురు చెల్లెళ్లు వున్నారు. వారి పెళ్లిళ్లు చేయడానికి చాలా కష్టపడ్డాను. 40 సంవత్సరాలపాటు కష్టపడితే కాని ఈరోజు కారుల్లో తిరగగలుగుతున్నాము. ప్రజలకు సేవ చేయాలన్నదే నా కోరిక. ఆ సేవచేస్తూనే చనిపోవాలన్నది నా ఆకాంక్ష. అదే మాకు మా నాన్న నేర్పారు అని చెప్పారు.