కాంగ్రెస్ నేత...అందులోను ఎపి కాంగ్రెస్‌కు అధ్యక్షులు ఇలా మాట్లాడమేంటి అనుకుంటున్నారా.. అయితే ఇందులో ఒక పెద్ద చిక్కే ఉంది. తన సొంత నియోజకవర్గమైన అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు రఘువీరారెడ్డి. అదే చేస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తానంటున్నారు. రఘువీరారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
కళ్యాణదుర్గంలో నీటి సమస్యను తీరిస్తే వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయను. నామినేషన్ కూడా వేయను. టిడిపి అభ్యర్థి గెలుపుకు దగ్గరుండి సపోర్ట్ చేస్తానంటూ ఇందిరమ్మ రాజ్యం - ఇంటింటా సౌభాగ్యం కార్యక్రమంలో రఘువీరారెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే చెరువులను అభివృద్థిని ఎలాగో ప్రభుత్వం చేయదు కాబట్టి రఘువీరారెడ్డి అంత ధైర్యంగా మాట్లాడారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.