అక్కడెక్కడో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో బిజెపి గెలిస్తే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బిజెపికి తిరుగులేదని బిజెపి నాయకులు చెబుతున్నారు. ఎపికి చెందిన ఒక బిజెపి నేత మాత్రం ఎపిలో రాజకీయాలను మేమే శాసిస్తాం.. మాకు తిరుగులేదు. టిడిపితో మాకు పొత్తు ఉండొచ్చు కానీ.. పొత్తుతో పని అవసరం ఉండకపోవచ్చు. బిజెపిపై దేశ ప్రజల్లో ఎంతో నమ్మకం పెరిగింది. ప్రధాని ప్రవేశపెట్టిన పథకాలు పూర్తిస్థాయిలో అమలు అవుతున్నాయని చెప్పారు.
ఎపిలోనే కాదు తెలంగాణా రాష్ట్రంలోను అధికారం మాదే. వచ్చే ఎన్నికల్లో బిజెపి జెండాను ఎగురవేస్తాం అని చెప్పారు బిజెపి నేత సోము వీర్రాజు. బిజెపిలో ఉన్న సోము వీర్రాజు ఆ పార్టీ గురించి గొప్పగా చెప్పుకుంటే ఫర్వాలేదు గానీ పొత్తు పెట్టుకున్న టిడిపిని చాలా హీనంగా మాట్లాడటమే ఇప్పుడు టిడిపి నేతలను ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.