అలా అయితేనే ప్రభుత్వ దౌర్జన్యాలకు పుల్‌స్టాప్‌: సీపీఐ నేత నారాయణ

మంగళవారం, 2 మార్చి 2021 (10:02 IST)
ప్రభుత్వ దౌర్జన్యాలకు, అరాచకాలకు పుల్‌స్టాప్‌ పడాలంటే విజయవాడలో సీపీఐ, తెలుగుదేశం విజయం ద్వారానే సాధ్యమవుతుందని సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు.

టీడీపీ, సీపీఐ అభ్యర్ధుల విజయాన్ని కోరుతూ సీపీఐ నేత నారాయణ మంగళవారం ఉదయం విజయవాడలో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఇక్కడ తీర్పు ఒక దిక్సూచిగా నిలవాలన్నారు. పూర్వ వైభవాన్ని మళ్లీ విజయవాడ నగరానికి తీసుకువద్దామని చెప్పారు. తొలిసారి విజయవాడ మేయర్‌ పదవిని దక్కించుకుంది సీపీఐనే అని గుర్తుచేశారు.

తాము అధికారంలోకి వస్తే ఎవరి మీద భారాలు పడకుండా సుపరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు. వరుస ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజలు విసిగిపోయారని నారాయణ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు