నకిలీ మద్యం కేసులో ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేల పాత్ర ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో వారిపై చార్జిషీట్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పలు ఛార్జిషీట్లను కోర్టుకు సమర్పించింది. ఆరు కేసుల్లో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి, నాలుగు కేసుల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిలను నిందితులుగా పేర్కొంటూ సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
వీరిద్దరిపై ఎపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 34(ఏ), 37(ఏ3), 420, 487, 120బీల కింద వీరిపై అభియోగాలను మోపింది. 2014 ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వీరు భారీ ఎత్తున కల్తీ మద్యం తెచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లోనే ఈ వ్యవహారం సంచలనం అయింది. ఎక్సైజ్ శాఖకు సుంకం చెల్లించకుండా, హాలోగ్రామ్‌లను మార్చి, లిక్కర్ మాఫియా ద్వారా కల్తీ మద్యాన్ని వీరి అనుచరులు తీసుకొచ్చినట్టు విచారణలో గుర్తించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇది వైకాపాకు తీవ్రషాక్‌కు గురి చేసే అంశంగా చెప్పుకోవచ్చు.