ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితులకు 1000 రిలీఫ్ కిట్‌లను పంపిణీ చేసిన ఇండస్ టవర్స్

ఐవీఆర్

సోమవారం, 9 సెప్టెంబరు 2024 (20:46 IST)
ప్రకృతి వైపరీత్యాలతో ప్రభావితమైన సముదాయాలను ఆదుకునేందుకు భారతదేశంలోని ప్రముఖ టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్‌లలో ఒకటైన ఇండస్ టవర్స్ తన నిబద్ధతను కొనసాగిస్తోంది. స్థానిక అధికారుల సహకారంతో, ఇండస్ టవర్స్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా మరియు గుంటూరు జిల్లాలలో వరద బాధిత నివాసితులు/ కుటుంబాలకు రెండు రోజుల పాటు 1000 రిలీఫ్ కిట్‌లను పంపిణీ చేసింది.కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్, ఆంధ్ర ప్రదేశ్ పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పర్యవేక్షణలో గుంటూరు జిల్లా పెద్దకాకాని సుందరయ్య కాలనీలో నేడు 400 కిట్‌లు పంపిణీ చేశారు. ఇటీవలి వరద సహాయక కేంద్రాల నుంచి ఈ స్థానికులు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. ప్రతి రిలీఫ్ కిట్‌లో బాధిత కుటుంబాలకు చాలా అవసరమైన చీరలు, తువ్వాళ్లు, దుప్పట్లు, ధోతీలతో సహా అవసరమైన వస్తువులు ఉన్నాయి. ఇండస్ టవర్స్ ఉద్యోగులు, భాగస్వామి వాలంటీర్లతో సహా 40 మందితో కూడిన ప్రత్యేక బృందం ఈ పంపిణీ ప్రక్రియను సులభతరం చేసింది.

భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మరియు సమాచార ప్రసారాల శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు మరియు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వరదల్లో నష్టపోయిన రైతులు, ప్రజలకు ఇండస్ టవర్స్ లిమిటెడ్, దిలీప్ కుమార్ గంటా (ఏపీ సర్కిల్ సీఈఓ) నేతృత్వంలోని వారి ఉద్యోగులకు, రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు స్వచ్ఛందంగా, మద్దతు ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇండస్ టవర్స్ భారతదేశంలో అతిపెద్ద టవర్ కంపెనీ మరియు వారు మరిన్ని టవర్లను నిర్మించాలని మేము కోరుకుంటున్నాము’’ అని తెలిపారు.

‘‘వరద సమయాల్లో సహాయక చర్యలను విస్తరించేందుకు టెలికమ్యూనికేషన్ చాలా కీలకం మరియు ఇండస్ టవర్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా తమ టెలికమ్యూనికేషన్ సేవలతో గొప్ప సేవ చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని గొల్లపూడి, భవానీ పురం మరియు వన్ టౌన్ ప్రాంతాల వాసులకు రేపు (సోమ) 600 రిలీఫ్ కిట్‌ల పంపిణీని విజయవాడ మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పర్యవేక్షించనున్నారు.

ఇండస్ టవర్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తేజిందర్ కల్రా మాట్లాడుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత వరదలతో నష్టపోయిన వారి సమస్యలకు మేము హృదయంతో స్పందిస్తున్నాము. ఇండస్ టవర్స్ స్థానిక అధికారులు, భాగస్వాములతో కలిసి అవసరమైన సామాగ్రి పంపిణీ, పునరుద్ధరణ ప్రక్రియలో సహాయం చేస్తోంది. ఈ వరదల అనంతరం, ప్రభావిత కమ్యూనిటీలకు అనుసంధానాన్ని పునరుద్ధరించడం చాలా కీలకం. మా వినియోగదారుల కోసం ఇండస్ టవర్స్ టెలికాం సైట్‌లను వేగంగా పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నాము. తద్వారా స్థానికులు తమ ప్రియమైన వారితో అనుసంధానమై ఉండేందుకు, ముఖ్యమైన సమాచారాన్ని యాక్సెస్ పొందుందకు వీలు కల్పిస్తుంది’’ అని వివరించారు.

ఇండస్ టవర్స్ సర్కిల్ సీఈఓ, ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్, దిలీప్ గంటా మాట్లాడుతూ, “మేము వరదల ప్రభావాన్ని అర్థం చేసుకుని, తక్షణ సహాయాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నాము. అవసరమైన సామాగ్రి పంపిణీలో సముదాయాలకు మద్దతు ఇచ్చేందుకు మా బృందం అంకితభావంతో ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల పునరుద్ధరణ ప్రయత్నాలలో మేము సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తాము’’ అని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు