ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో సీట్ల కుదింపుపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 23 ను హైకోర్టు రద్దు చేసింది . మరోవైపు ఇంటర్మీడి యెట్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి పాత పద్ధతినే అనుసరించాలని ఆదేశించింది.
అయితే క్షుణ్ణంగా అధ్యయనం చేసి కొత్త విధానాన్ని రూ పొందించే వెసులుబాటును ప్రభుత్వానికి కల్పించింది. కొత్త విధానాన్ని అనుసరించే ముందు మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆన్ లైన్ ద్వారా ప్రవేశాలు చేపట్టాలంటే నిర్దిష్ట విధి విధానాలను రూపొందించుకుని చేపట్టవచ్చని పేర్కొంది. ప్రెస్ నోట్ జారీ చేసి దాని ఆధారంగా ఆన్లైన్ ప్రవేశాలు చేపడతామంటే కుదరదని స్పష్టం చేసింది.