వీరికి సంజయ్ అనే పేరుతో లీడర్ వుండేవాడని చెప్పారు. వీరిచ్చిన సమాచారం మేరకు బెంగళూరుతో పాటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దాడులు చేశారు. ఈ క్రమంలో వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద జరిపిన విచారణలో ఈ సెక్స్ రాకెట్ కోల్ కతా-బెంగళూరు- హైదరాబాద్‌ల మీదుగా జరుగుతుందని తెలిసింది.
ఈ సెక్స్ రాకెట్‌కు నాయకుడైన సంజయ్ ఈ వ్యాపారం కోసం 50 వెబ్ సైట్లు రూపొందించాడు. వీటి నిర్వహణ కోసం ఉద్యోగులను కూడా నియమించాడు. ఈ దందాలో మోడల్స్, డ్యాన్సర్లు సహా సినీ రంగంలో అంతగా అవకాశాలు రానివారు ఉన్నారని పోలీసులు గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది ముంబై, కోల్ కాతా, ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ నగరాలకు చెందిన యువతులున్నారని సమాచారం.
అందమైన అమ్మాయిలను దారిలో పెట్టేందుకు ఖరీదైన పార్టీల్లో పాల్గొనేలా సంజయ్ ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసి పంపిస్తాడు. అలా మచ్చిక చేసుకున్న తరువాత వారికి పనులు అప్పజెబుతాడు. పార్టీల సందర్భంగా తీసిన ఫోటోలను తన వెబ్ సైట్లలో అప్ లోడ్ చేస్తాడు. ఈ వెబ్ సైట్లలో అమ్మాయిని బుక్ చేసుకోవాలంటే రూ.25వేల నుంచి లక్ష రూపాయల వరకు చెల్లించాల్సిందే.
కస్టమర్ కోరుకున్న అమ్మాయిని విమానంలో ఆ నగరానికి పంపిస్తాడు. ఆ నగరంలోని బ్రాంచ్ వ్యభిచార కేంద్రంలో ఆమెతో గడపమంటాడు. ఇలా విటులతో గడిపినందుకు ఒక్కో యువతికి వారానికి ఇంచుమించు రెండు లక్షల రూపాయలు చెల్లిస్తుంటాడు. కోల్ కతాలో ఉండే సంజయ్ కోసం వేట మొదలైంది. ఈ సెక్స్ రాకెట్‌పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.