దమ్ముంటే నన్నుఅరెస్ట్ చేయాలి.. వైకాపా చీఫ్ జగన్ సవాల్

సెల్వి

బుధవారం, 13 నవంబరు 2024 (22:25 IST)
Jagan
వైకాపా సోషల్‌ మీడియా నేతల అరెస్టులను ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖండించారు. బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం దీన్ని వ్యవస్థీకృత నేరంగా చిత్రీకరిస్తోందని, తన సోషల్ మీడియా సెల్‌లో ఉన్న యువకులను ఎందుకు అరెస్టు చేస్తుందని ప్రశ్నించారు. సోషల్‌ మీడియా పేరుతో ఎవరెవరినో కాకుండా తనను అరెస్ట్‌ చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్‌ విసిరారు. అంతేకాకుండా తనను ఎమ్మెల్యేగా కూడా తొలగించాలని ఛాలెంజ్‌ చేశారు.
 
పనిలో పనిగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై జగన్ ఫైర్ అయ్యారు. ఏపీ బడ్జెట్ మీద వైఎస్ జగన్ స్పందించారు. ఇది ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ అని వైఎస్ జగన్ విమర్శించారు. ఎన్నికలకు ముందు వైసీపీ హయాంలో అప్పులు పెరిగిపోయాయని.. ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా మారుతుందంటూ తప్పుడు ప్రచారం చేశారంటూ జగన్ ఆరోపించారు. ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటున్నారన్న జగన్.. ఈ క్రమంలో దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్ నటననే మించిపోయేలా చంద్రబాబు యాక్టింగ్ చేస్తున్నారంటూ విమర్శించారు.
 
అసెంబ్లీ జరిగిన అన్ని రోజులు ఇలానే మా ఎమ్మెల్యేలు నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తానని జగన్‌ స్పష్టం చేశారు. ఎన్నికల సమయానికి అప్పులు రూ.14 లక్షల కోట్ల వరకు వెళ్లినట్టు తప్పుడు ప్రచారం. పద్ధతి ప్రకారం సూపర్ సిక్స్ తెరమరుగుచేయాల్సిన పరిస్థితి. దీనికోసం ఈ అబద్ధాలు చెబుతూ జగన్‌పై ఆ నెపం నెడుతున్నారు' అని జగన్ మండిపడ్డారు. 

జగనన్న పిలుపు ✊

ఇక ఆట మొదలు ????

నేను ట్వీట్ పెడతా.. అందరూ ట్వీట్ పెట్టండని సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకి పిలుపిస్తున్నా! - YS Jagan Mohan Reddy గారు#TweetWithYSJagan #YSJagan pic.twitter.com/ENKXV0d9yV

— kodali Nani ki thamudu jagan Anna na pranam (@pagholuRagava) November 13, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు