ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతిగా వైకాపా మాజీ మంత్రి, ప్రస్తుత ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. రఘురామకృష్ణం రాజు ఎంపికకానున్నారు. ఈ మేరకు ఆయన పేరును టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ ఉప సభాపతి ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్ నేడు లేదా రేపు వెల్లడయ్యే అవకాశం ఉంది. పైగా, ఈ పదవికీ ఎవరూ నామినేషన్ దాఖలు చేసే అవకాశం లేదు. దీంతో ఉప సభాపతిగా ఆర్ఆర్ఆర్‌ను ఏకగ్రీవంగా ఎంచుకోవడం లాంఛనమేకానుంది.
ఉప సభాపతి కోసం మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు అనేక మంది పేర్లను పరిశీలించారు. చివరకు ఆర్ఆర్ఆర్ వైపే ఆయన మొగ్గు చూపారు. బుధ, గురువారాల్లో డిప్యూటీ స్పకర్ పదవికి నోటిఫికేషన్ విడుదలకానుంది. మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోతే కూటమి ఎమ్మెల్యేు ఆయనను ఉప సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఫలితంగా ఆర్ఆర్ఆర్ ఎన్నిక లాంఛనమేకానుంది.
కాగా, ఉప సభాపతిగా ఆర్ఆర్ఆర్ పేరును చంద్రబాబు వ్యూహాత్మకంగానే ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీకి రావడం లేదు. గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైనా ప్రతిపక్ష హోదా కావాలంటూ పట్టుబడుతున్నారు. అది సాధ్యంకాదు. దీంతో ఆయన అసెంబ్లీకి రావడం లేదు. ఈ క్రమంలో జగన్‌ను శాశ్వతంగా అసెంబ్లీలో అడుగుపెట్టనీయంగా చేసేందుకే ఆర్ఆర్ఆర్ పేరును ఉప సభాపతిగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.