ముఖ్యమంత్రి హోదాలో కోర్టు మెట్లు ఎక్కనున్న మొదటి వ్యక్తి జగన్‌: బోండా ఉమామహేశ్వరరావు

శుక్రవారం, 3 జనవరి 2020 (22:31 IST)
సీఆర్డీయే పరిధిలో తనకు భూములున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి  అంటున్నారని, మరి 2019 ఎన్నికల్లో ఆయన ఎన్నికలసంఘానికి ఇచ్చిన అఫడవిట్‌లో పేర్కొన్న భూములెవరివో చెప్పాలని టీడీపీ మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. 

మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు... ఆళ్ల రామకృష్ణారెడ్డి  ఎన్నికల సంఘానికి ఇచ్చిన 2019 అఫడవిట్‌లో సీర్డీయే పరిధిలో  ఆళ్ల రామకృష్టారెడ్డి పేరుతో వివిద సంవత్సారాల్లో  2018 వరకు కొనుగోలు చేసిన భూమి  62.98 సెంట్లు, ఆయన భార్య రాధ పేరుతో 8 ఎకరాలు భూమి ఉంది. రామకృష్ణారెడ్డి తన  ఆస్తులు మర్చిపోతే ఆయన ఒకసారి ఎన్నికల అఫడవిట్‌ చెక్‌చేసుకోవాలి.

గుంటూరు  జిల్లాలోని  పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ,  పిరంగిపురం, గుంటూరు, నల్లపాడు, తాళ్లూరు, వేమవరం లలో ఆయనకు ఆస్తులున్నాయి.  రాజధాని పరిధిలో వేల ఎకరాల భూములు వైసీపీ నేతలకు ఉంటే  మరో వైపు టీడీపీ నేతలు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ ఆరోపించటం విడ్డూరంగా ఉంది. రాజధానికి రైతులిచ్చిన భూములన్ని ఒకే సామాజికవర్గం వారివంటూ వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది. 

రైతులిచ్చిన 33 వేల ఎకరాలలో కమ్మసామాజిక వర్గం వారివి కేవలం 7 వేల ఎకరాలు మాత్రమే. మిగతా 26 వేల ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ కాపులవే. కానీ  వైసీపీ నేతలు ఒక సామాజిక వర్గం పేరుతో రాజధానిని చంపే ప్రయత్నం చేస్తున్నారు.  వైసీపీ  వైఖరిని రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. 5 కోట్ల ఆంధ్రుల ఏకాభిప్రాయంలో ఏర్పాటైన రాజధాని అమరావతిపై  ఈ ప్రభుత్వం మళ్లీ జీఎన్‌రావు, బీసీజీ, హైపవర్‌ కమిటీలు వేయటం ఎందుకు? 

ఆర్డీవో క్యాడర్‌ అధికారి, రిటైర్డ్‌ ఐయస్‌ జీఎన్‌ రావు. గతంలో ఏ రాష్ట్రానికైనా రాజధాని ఎంపిక చేసిన చరిత్ర ఆయనకు ఉందా? న్యూయార్క్‌ దగ్గరల్లో ఉన్న  బోస్టన్‌ నగరం వారు మన  రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలో సూచిస్తారా? బీసీజీ గ్రూప్‌పై ఇంటర్‌పోల్‌ అధికారులు కేసులు పెట్టారు. 

ఆ కేసుల్లో ఈ కంపెనీ  డైరక్టర్లను కూడా అరెస్ట్‌ చేయటం జరిగింది. ఇలాంటి బోస్టన్‌ కమిటి పేరుతో బోగస్‌ కమిటీ వేసి జగన్‌ మనసులో అంశాన్ని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. తాను  ప్రమాణస్వీకారం చేసిన నాడే రాజధాని అమరావతిని చంపేయాలని జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.కానీ  ఇది తెలియడానికి ప్రజలకు 6 నెలల పట్టింది. వైసీపీ నేతలు టీడీపీపై చేసిన  ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ ఆరోపణలు  నిరూపించాలంటూ మేం సవాలు విసరటంతో వారు దాని గురించి మాట్లాడటం మానేశారు. 

టీడీపీ  పాలనలో అవినీతి జెరిగిదంటూ..గతంలో రాష్ట్రం మొత్తం ప్రచారం చేసిన జగన్‌ అధికారంలోకి వచ్చి 7 నెలలయినా ఎందుకు నిరూపించలేకపోయారు? ప్రతి శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ కోర్టుకు హాజరు కావాల్సిందే అంటూ ఇవాళ సీబీఐ కోర్టు పేర్కొంది.  ముఖ్యమంత్రి హోదాలో కోర్టు మొట్లు ఎక్కిన వ్యక్తిగా జగన్‌  చరత్రకెక్కనున్నారు. ఈ విధంగా జగన్‌ రాష్ట్ర పరువు తీస్తున్నారు.

సెబీ రూల్స్‌ ప్రకారం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనేది కంపెనీలకు సంబందించినది.  దీనికి వర్తించదు. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధానిని వైసీపీ ఒక పధకం ప్రకారం దెబ్బతీస్తోంది. రాజధాని పరిరక్షణ కోసం ఉద్యమం చేసే అన్ని సంఘాలకు టీడీపీ మద్దతు తెలిపి ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం, మా ప్రాణాలు పణంగా పెట్టయినా అమరావతిని కాపాడుకుంటామని బోండా ఉమమహేశ్వరావు స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు