కాంట్రాక్ట్ మార్చుతూ పోతే డ్యామ్ భద్రతకు బాధ్యత ఎవరిది? అని అడిగారు. చంద్రబాబు పేరు కన్పించకుండా చేయాలన్నదే జగన్ అక్కసు అని చెప్పారు. "వైసీపీ నేతల దుశ్చర్యలతో 70 ఏళ్ళ రాజ్యాంగం, 73 ఏళ్ళ స్వాతంత్య్రం పరిహాసం పాలయ్యాయి.
రక్తం చిమ్మి, ఎముకలు జల్లి యజ్ఞాలను భగ్నం చేయడం పురాణాల్లో విన్నాం. అంతకు మించిన రాక్షస కృత్యాలను ఇప్పుడే చూస్తున్నాం. దేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా నివసించే హక్కుంది. ప్రాణాలు, ఆస్తులు కాపాడుకునే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది.
పాడి గేదెలకు విషం పెట్టి చంపుతారా? ఎస్సీలు, ముస్లిం మైనారిటీల ప్రాణాలతో చెలగాటం ఆడతారా? బోర్లు పూడ్చేయడం, పైపులు కోయడం..ఇవన్నీ రైతు కష్టం తెలిసినవాళ్లు చేసే పనులేనా? మానవత్వం ఉన్నవారంతా ఈ అరాచకాలను ఖండించాలి. బాధితుల పక్షాన ప్రజా సంఘాలన్నీ నిలబడాలి" అని మండిపడ్డారు.