నాణ్యమైన విద్యను పేద విద్యార్ధులకు అందించేలా జగన్ పని: సజ్జల

సోమవారం, 6 సెప్టెంబరు 2021 (07:03 IST)
చదువుకు పేదరికం అడ్డం కాకూడదనే లక్ష్యంతో నాణ్యమైన విద్యను పేద విద్యార్ధులకు అందించే విదంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పనిచేస్తున్నారని ప్రభుత్వ సలహాదారులు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తల్లిదండ్రులు తర్వాత విద్యార్దుల జీవితాలను తీర్చిదిద్దే ఉపాద్యాయులకు సమాజంలో అత్యంత గౌరవం ఉంటుందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు ఉత్తమ పౌరులను తయారు చేయగలగుతారని అన్నారు.

ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారిన క్రమంలో విద్యార్దులు అత్యధిక సమయం గురువుల వద్దనే గడుపుతారని అన్నారు. మంచి వ్యక్తిత్వ వికాసం,మంచి అలవాట్లు,బాధ్యతాయుత జీవన విధానం గురించి ఉపాధ్యాయులు విద్యార్దులకు సరైన మార్గనిర్దేశనం చేయగలిగితే మంచి సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. 
 
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ .....ముఖ్యమంత్రి వైయస్ జగన్ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.దానిలో భాగంగానే అంగన్ వాడి కేంద్రాల వద్ద నుంచి ఉన్నత విద్య వరకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. ముఖ్యంగా విద్యారంగాన్నిపటిష్టపరచాలనే ధ్యేయంతో 16 వేల కోట్ల రూపాయలు పెట్టి నాడు-నేడు కార్యక్రమం చేపట్టారని తెలియచేశారు.

ఇంతకుముందు పాలకులు విద్య,వైద్యరంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు.విద్య,వైద్యంను కొనలేక అనేక కుటుంబాలు భారంగా భావించే పరిస్ధితి,ఛిన్నాభిన్నమైన స్దితి ఉండేదన్నారు. పేదలు కార్పోరేట్ విద్యను అందుకోలేని పరిస్ధితి ఉంది.దీనిని మార్చాలనే లక్ష్యంతో జగన్ అధికారంలోకి వచ్చిన మొదటిరోజునుంచి పనిచేస్తున్నారన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఆరోగ్యశ్రీ మరింత శక్తివంతంగా అనేక వ్యాధులకు చికిత్సను అందులో చేర్చారన్నారు.
 
ఇక విద్యరంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు.  ప్రభుత్వ విద్యాలయాలు వైయస్ జగన్ పాలనలో ఆహ్లాదకర,ఆరోగ్యకర వాతావరణంలో,కంప్యూటర్ డిజిటల్ ల్యాబ్ లు,మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, క్రీడావసతులు, కాంపౌండ్ వాల్ వంటి మౌళికసదుపాయాలు కల్పన వేగంగా జరుగుతోందన్నారు. ఇప్పటికే ఫస్ట్ పేజ్ పూర్తి అయిందన్నారు.

విద్యార్దులకు నోట్,పాఠ్యపుస్తకాలు,బ్యాగ్స్,షూస్,యూనిఫామ్ విద్యాకానుక ద్వారా అందించడం,వారికి పౌష్టికాహారం గోరుముద్ద ప్రోగ్రామ్ ద్వారా అందిస్తున్నారన్నారు. పేద కుటుంబాలు సైతం మా పిల్లలను మేమే చదివించుకుంటున్నామని భావించుకునేలా విద్యాదీవెన ద్వారా ఆ విద్యార్దుల తల్లుల అకౌంట్లలోనే వేయడం జరుగుతుందన్నారు.

అదేవిధంగా విద్యార్దులు డ్రాపవుట్స్ గా మారకుండా చిన్నారులను స్కూల్ కు పంపితే వారి తల్లుల అకౌంట్లలో ప్రోత్సాహకంగా డబ్బు వేయడం జరుగుతుందన్నారు. సరైన,నాణ్యమైన విద్య అందించినప్పుడే ఆ చిన్నారులు భావి భారత పౌరులుగా సమాజానికి ఉపయోగపడేవారిగా తయారవుతారని వైయస్ జగన్ నమ్ముతారని అందుకనే విద్యకు ప్రధమ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలియచేశారు.

ఇది వైయస్ జగన్ లోని దార్శినికతను తెలియచేస్తోందన్నారు. అదే విదంగా పోటీ ప్రపంచంలో మన విద్యార్దులు మనగలగాలి....పోటీ పడాలి... అంటే ఆంగ్ల విద్య అవసరాన్ని గుర్తించి ఆంగ్ల విద్య వారికి చేరువ చేసేందుకు పట్టుదల ప్రదర్శిస్తున్నారన్నారు. మాతృభాషను మరిచిపోయేలా చేస్తున్నారని,దానికి అన్యాయం చేస్తున్నారని కొందరు అర్ధం పర్ధంలేని వాదన చేస్తున్నారని అన్నారు.

కొందరు తెలుగు భాష గురించి జాగ్రత్త కోసం చెబుతుండవచ్చు.కాని రాజకీయంగా విమర్శలు చేయాలని చాలామంది చేస్తున్నారని..... కాని ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఇంగ్లీషు నేర్చుకోవడం,మాట్లాడగలగడం ద్వారా విద్యార్దులు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లగలరన్నారు.ఇది అలా విమర్శలు చేస్తున్నవారు గమనిస్తే మంచిదన్నారు. 
       
ప్రధానంగా విద్యార్ధులు చిన్నతనం నుంచి అంటే సైంటిఫిక్ గా ఏ వయస్సునుంచి వారు చక్కగా నేర్చుకోగలరో గమనించి ఆ వయస్సునుంచే వారికి మంచి వాతావరణంలో విద్యను అందించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. జాతీయవిద్యావిధానంలో భాగంగా ఉన్న అన్ని అంశాలను మన రాష్ర్టంలో రెండు అడుగులు ముందుకు వేసి అమలు చేయడం జరుగుతుందన్నారు.

ప్రభుత్వ స్కూల్స్ లో చదివే వారిలో ఆత్మన్యూనత ఉంటుంది. కాని వారికి కూడా కార్పోరేట్ స్కూల్స్ లో లాగా అన్ని సౌకర్యాలు కల్పించి వారిలో ఆత్మన్యూనత పొగొట్టే విధంగా చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వపరంగా అన్ని స్కూల్స్ లో కూడా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుందన్నారు. మంచి గురువులను వారికి అందించినప్పుడే వారికి మంచి విద్య లభిస్తుందన్నారు.

విద్యారంగంలో వచ్చే ఆధునిక పోకడలను ఉపాధ్యాయులు ఆకళింపు చేసుకుని విద్యార్దులకు తెలియచేయాలని కోరారు.  వైయస్ జగన్ స్కూల్స్ లో ఏవైతే ఏర్పాటుచేస్తున్నారో వాటిని అందరూ అంటే విద్యార్దులు,వారి తల్లిదండ్రులు ఆయా గ్రామాలు,పట్టణాలలోని ప్రజలు పరరిక్షించుకోవాల్సి ఉందని అన్నారు. వైయస్ జగన్ చేస్తున్న కార్యక్రమాలను సరైన రీతిలో ఉపయోగించుకుంటే సమగ్ర విద్యాభివృధ్ది సాధ్యమవుతుందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు