తన తండ్రి వైయస్ హయాంలోనే ప్రాచీన హోదా వచ్చిన విషయం జగన్ గుర్తించుకోవాలి. మేం ఏ భాషకు వ్యతిరేకం కాదు. మాతృభాషలో భోదన కూడా ఉండాలనేది మా డిమాండ్. తెలుగు మీడియం కొనసాగిస్తూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టండి. వెంకయ్యనాయుడు చేసిన సూచన పాటిస్తే సరే లేకపోతే లేదు. ఉపరాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి.
విలేఖరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్సులు అడపా శివనాగేంద్రరావు,తాళ్ల వెంకటేష్ యాదవ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గండవరపు జగన్,పాలిశెట్టి రఘు,రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.