జగనన్న విద్యా దీవెన 3వ విడత.. ఖాతాల్లో రూ.686 కోట్లు

మంగళవారం, 30 నవంబరు 2021 (12:03 IST)
జగనన్న విద్యా దీవెన 3వ విడత ప్రారంభమైంది. ఈ ఏడాది మూడో విడతగా రూ.11.03 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద రూ.686 కోట్లు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశారు.
 
కరోనా సమయంలో కూడా విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 'ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 021 ఏప్రిల్‌ 19న మొదటి విడత.. జూలై​ 29న జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధుల్ని నేరుగా తల్లుల ఖాతాల్లో జమచేశామని చెప్పారు. పేదరికం చదువుకు అవరోధం కారాదని... ఉన్నత చదువులు అభ్యసిస్తేనే తల రాతలు మారుతాయని జగన్ వ్యాఖ్యానించారు.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు