'దేశంలో ఏ ఒక్క కార్మికుడినీ విధుల నుంచి తొలగించరాదని, వారికి క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలి' అని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారని గుర్తుచేశారు. అయినా తితిదే పెద్దలు ఒక్క కలం పోటుతో వారిని తొలగించారు. ఈ చర్య సహేతుకం కాదు. పైగా, టీటీడీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. వారందరినీ కొనసాగించాలి, రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ బోర్డు, ఈఓలకు ఇదే నా విజ్ఞప్తి అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అయింది.
దీనిపై ఇటు జగన్ సర్కారు, అటు తితిదేలు స్పందించాయి. 1400 మంది కార్మికులను కొనసాగించాలని తితిదే నిర్ణయం తీసుకుంది. దీనికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సర్కారు, తితిదే తీసుకున్న నిర్ణయం సముచితంగా ఉందని పేర్కొన్నారు.