ఇకపోతే, ఏపీలో తమకు ఎదురే ఉండకూడదని వైకాపా నేతలు భావిస్తున్నారు. అందుకే అరాచకాలకు శ్రీకారం చుట్టారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. మున్ముందు వైకాపా విశ్వరూపం చూడాల్సి ఉంటుంది. తాను ఏ చిన్న పని చేసినా వైకాపా నేతలు టార్గెట్ చేయడం వారికి అలవాటు అయిపోయింది. వారాహి వాహనం కొనుగోలు చేసినా అది వారికి కడుపుమంటే. అందుకే ఆ వాహనం రిజిస్ట్రేషన్‌పై పెద్ద వివాదం సృష్టించారు అని అన్నారు.