మా వాడు చాలా సీరియస్‌గానే ఉన్నాడు.. హైకోర్టునే పీకిపారేశాడు... జేసీ కామెంట్స్

గురువారం, 21 మే 2020 (15:01 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో మా వాడు చాలా సీరియస్‌గానే ఉన్నట్టు కనిపిస్తున్నాడని చెప్పుకొచ్చారు. అదేసమయంలో కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా మావాడు లెక్కచేయడు. పైగా హైకోర్టునే పీకి పారేశాడు అంటూ కామెంట్స్ చేశారు. 
 
ఇదే అంశం జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని.. వాళ్లదే రాజ్యమంటూ ఆరోపించారు. వాళ్లు చెప్పిందే చేయాల్సిందే అని డీఎస్పీ కింది స్థాయి అధికారులు హెచ్చరిస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఇకపోతే, ప్రభుత్వం జారీ చేస్తున్న అడ్డగోలు జీవోలపై కోర్టులు వేస్తున్న అంక్షింతలపై జేసీ స్పందించారు. 'కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా మా వాడు లెక్కచేయడం లేదు. హైకోర్టునే పీకి పారేశాడు. ఆయనకు అందరు గజగజ వణుకుతారు. 
 
అమరావతి రాజధాని కోసం 158 రోజులుగా దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎండకు ఎందుకు చస్తున్నారు. మీ సమస్య ఏంటి..? అని కూడా అడగడం లేదు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. వైఎస్ తప్పు చేస్తున్నాడు. అసలు మా వాళ్లు (టీడీపీ నేతలు) ఎందుకు దీక్ష చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. 
 
ఒకరో ఇద్దరో దీక్ష చేస్తే జగన్‌లో మార్పు రాదు. ఉవ్వెత్తున ఆయన ఇంటి ముందు కూర్చోవాలి. నిరాహార దీక్ష నిజంగా చేసినా ప్రజలు నమ్మరు. బిర్యానీ తిని చేస్తున్నారనుకుంటారు. కొడితే 32 పండ్లు రాలేలా కొట్టాలి. లేదంటే దాని జోలికి పోకూడదు. జిందాబాద్... ముర్దాబాద్‌లకు జగన్ మాట వినడు. రాష్ట్రంలో సగం జనాభా ఆయన ఇంటి ముందు కూర్చుంటే వింటాడేమో..?. 
 
ఇకపోతే, నీళ్ల విషయంలో అన్నదమ్ములు అయినా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తారు. ఒకరి తల ఒకరు నరుకేందుకు వెనకాడరు. పోతిరెడ్డి పాడు విషయంలో మా వాడు చాలా సిన్సియర్‌గానే ఉన్నాడు అనిపిస్తోంది అంటూ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొంతసేవు తిడుతూ, మరికొంతసేవు మావాడు అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు