ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఒక్క అమరావతిని లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే బదులు, మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయవచ్చన్నారు. ఇక్కడ అసెంబ్లీని పెట్టి, శీతాకాల సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని సిద్ధారెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ శాఖల అధిపతుల కార్యాలయాలను కూడా జిల్లాల స్థాయిలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
మరోవైపు, రాజధాని మార్పు అంశంపై మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పందించారు. అమరావతిలో 4,500 ఎకరాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. రాజధాని మార్పుపై హైపవర్ కమిటీ నివేదికదే తుది నిర్ణయం అన్నారు. గత పొరపాట్లు పునరావృతంకాకుండా నిర్ణయాలుంటాయని చెప్పారు.