కాకినాడలో వైద్యుడిపై పోలీసుల దాష్టీకం.. లాఠీలతో చితక్కొట్టారు...

మంగళవారం, 22 ఆగస్టు 2023 (09:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు మరింతగా జులుం ప్రదర్శిస్తున్నారు. ఏమాత్రం విచక్షణా రహితంగా ప్రజలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా కాకినాడ బస్టాండు సమీపంలో రాత్రి గస్తీలో ఉన్న కానిస్టేబుల్‌పై ఓ వైద్యుడు లాఠీతో విరుచుకుపడ్డాడు. తాను వైద్యుడినని చెబుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా చావబాదాడు. ఈ దాడిలో ఆ వైద్యుడు తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కాకినాడ జిల్లా పెదపూడికి చెందిన ఆనంద కుమార్ విశాఖలో ఆర్థోపెడిక్ వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి ఒంటిగంటకు విశాఖకు వెళ్లేందుకు బస్ టికెట్ తీసుకున్నారు. కాకినాడలోని స్నేహితుడిని కలవడానికి ముందే బస్టాండుకు వచ్చారు. ఇద్దరూ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఫ్లై ఓవర్ కింద కారులో కూర్చొని భోజనం చేస్తున్నారు. ఈలోగా రాత్రి పెట్రోలింగ్‌కు కాకినాడ రెండో పట్టణ సీఐ నాగేశ్వర్ నాయక్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు వచ్చారు. 
 
ఓ కానిస్టేబుల్ వారి దగ్గరకు వచ్చి 'ఏం చేస్తున్నావ'ని ప్రశ్నించడంతో 'భోజనం చేస్తున్నాం. పూర్తయ్యాక వెళ్లిపోతామ'ని వైద్యుడు చెప్పారు. సీఐ పిలుస్తుంటే కూర్చుంటావా అని గద్దించడంతో.. ఆనందకుమార్ సీఐ వద్దకు వెళ్లారు. తన వివరాలు చెప్పి విశాఖకు వెళ్లడానికి వచ్చానన్నారు. ఈలోగా కానిస్టేబుళ్లు కారు తనిఖీ చేస్తుండటం, స్నేహితుడు పత్రాలు చూపిస్తుండటంతో వైద్యుడు కూడా అక్కడికి వెళ్లి నిల్చున్నారు.
 
ఇంతలో కానిస్టేబుల్ సుబ్బారావు వెనుక నుంచి వచ్చి తీవ్రంగా కొట్టాడు. వీపు, కాలిపై వాతలు చూపారు. తప్పు చేయకుండా తనను ఎందుకు కొట్టారో చెప్పాలని సీఐని, కానిస్టేబుళ్లను ప్రశ్నించగా, పక్కకు తప్పించి వెళ్లిపోయారని వాపోయారు. టూటౌన్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా నమోదు చేయలేదనీ, వేకువజామున 4 గంటల వరకు అక్కడే ఉన్నానని ఆనంద్ తెలిపారు. తప్పుచేసిన కానిస్టేబుల్‌పై కేసు పెడితే రోడ్డున పడతారని, అంతా సర్దిచెప్పడంతో వెనక్కి వచ్చేశానన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు