ఆంధ్రప్రదేశ్‌లో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ బలపడటం అనేది ఎంతమాత్రం కూడా సాధ్యం కాదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ నేతలు ఎన్ని విధాలుగా రాజకీయం చేసిన సరే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌ను లేదా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడం అనేది సాధ్యమయ్యే పనికాదని అనుకుంటున్నట్లు భోగట్టా.
ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీకి చెందిన కొంతమంది నేతలు వేరే పార్టీల వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. వేరే పార్టీల వైపు చూస్తున్న పర్వాలేదు కానీ ఇప్పుడు జనసేన పార్టీ లోకి వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ నేతలు రెడీ అవుతున్నారట. మున్సిపల్ ఎన్నికల్లో అలాగే పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం చూపించిన నేపథ్యంలో కొంతమంది నేతలు జనసేన పార్టీ లోకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.