ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలలో ఎప్పుడైనా రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. దీనితో గెలుపు గుర్రాల పైన ఆయా పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇటీవలే జనసేన 24 సీట్లలో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించడంతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాసారు. కనీసం 80 సీట్లు తీసుకుంటారని, రెండున్నరేళ్లు సీఎం పదవి తీసుకుంటారని ఊహిస్తే ఎందుకూ పనికిరాని నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు.
మరోవైపు ఆ లేఖతో జనసేనాని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. పిఠాపురంలో తనపై పోటీ చేసి విజయం సాధించాలంటూ ముద్రగడకు సవాల్ విసిరారు. ఈ నేపధ్యంలో పాలక పార్టీ వైసిపి ముద్రగడపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు కీలక నాయకులను ముద్రగడ ఇంటికి పంపించి మంతనాలు జరిపినట్లు సమాచారం. ముద్రగడ అంగీకరిస్తే ఆయనను పిఠాపురం నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.