పెళ్లి ముహూర్తానికి ఆలస్యంగా వచ్చిన పురోహితుడు.. పిడిగుద్ధులు గుద్దారు..

ఆదివారం, 19 మార్చి 2017 (14:10 IST)
పెళ్లి ముహూర్త సమయాని కంటే లేటుగా వచ్చాడని, పురోహితుడిపై వధువు బంధువులు దాడికి దిగారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా బసంత్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా బసంత్ నగర్‌కు చెందిన రాజయ్య కూతురు వివాహం జరిపించేందుకుగాను పాలకుర్తికి చెందిన స్థానిక కోదండ రామాలయ పూజారి సేనాపతి వెంకటరమణాచారి వెళ్ళారు. 
 
కానీ ముహూర్త సమయాని కంటే వివాహానికి ఆలస్యమైందనే విషయాన్ని మద్యం సేవించి వచ్చిన వధువు తరపు బంధువులు పురోహితుడితో గొడవ దిగాడు. దీంతో పురోహితుడితో ఆయన వాగ్వావాదానికి దిగాడు. కొద్దిసేపు వివాహ తంతు ఆపాల్సి వచ్చింది. 
 
ఇరువైపులా బంధువులు సర్ధిచెప్పి వివాహ తంతును కొనసాగించారు. వివాహం పూర్తైన తర్వాత చొప్పదండి మండల కేంద్రానికి చెందిన వధువు తరపు బంధువు పురోహితుడిపై కర్రతో దాడి చేసి పిడిగుద్దులు గుద్దాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి