ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నూతన సంవత్సరం 2025 ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు ఏకంగా 15 నుంచి 20 శాతం పెంపు వుండనుంది. ఈ విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఎంతెంత రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలో జనవరి 15 లోపుగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలియజేశారు.