ఏపీ పోలీస్ సేవ యాప్ ను ముఖ్యమంత్రి జగన్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ ససాంగ్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా దాదాపు 87 రకాల సేవలను పొందవచ్చు. పోలీస్ స్టేషన్ ద్వారా లభించే అన్ని రకాల సేవలను ఈ యాప్ ద్వారా పొందవచ్చు.
ఎన్నెన్నో విశేషాలు
దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్ శాఖ సరికొత్త యాప్‌ను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండా ప్రజలకు 87 రకాల సేవలను పొందేలా ప్రత్యేకంగా ‘ఏపీ పోలీస్ సేవ’యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
పోలీసు స్టేషన్ ద్వారా లభించే అన్నిరకాల సేవలను ఈ మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు. అన్ని నేరాలపై ఫిర్యాదులు చేయొచ్చు..అంతే కాకుండా ఫిర్యాదులకు రశీదు కూడా పొందే విధంగా యాప్ ను రూపొందించారు. పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనున్న ఈ ఏపీ పోలీస్ సేవ’యాప్.
ఏపీ పోలీస్ సేవ’యాప్ అందించే సేవలు:
•దర్యాప్తు పురోగతి, అరెస్టులు, ఎఫ్‌ఐఆర్‌లు, రికవరీలు, రహదారి భద్రత, సైబర్ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు, ఎన్‌వోసీలు, లైసెన్సులు, పాస్‌పోర్ట్ సేవలు, ఇతర వెరిఫికేషన్లు ఇలా అన్ని పోలీసు సేవలను యాప్ ద్వారా పొందవచ్చు.
•ఏపీ పోలీస్ సేవ’యాప్ నుంచే వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసర సమయాల్లో వీడియో కాల్ చేస్తే పోలీస్ కంట్రోల్ రూంకు వెంటనే సమాచారం వెళ్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే సౌకర్యం.
•ఈ యాప్‌లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 మాడ్యూల్స్ తో ' మహిళల కు రక్షణగా , తోడు నీడగా అన్ని వేళల్లో పోలీసులు తమకు రక్షణ ఉన్నారు అనే భావనతో వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా ఈ యాప్ సేవలను అందిస్తుంది.
•రాష్ట్రం లోని మహిళలకు అన్ని సందర్బాలలో అందుబాటులో ఉండే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజీ తో ప్రవేశ పెట్టిన దిశ మొబైల్ అప్లికేషన్ స్వల్ప వ్యవధి లోనే పదకొండు(11) లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. 568 మంది నుండి ఫిర్యాదులు స్వీకరించగా 117 యఫ్.ఐ.ఆర్ లను నామోదు చేసి చర్యలు తీసుకున్నాము.
•ఆపదలో ఉన్న మహిళలకు తక్షణమే పరిష్కరించటం కోసం ఇప్పటికే సైబర్ మిత్ర ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 9121211100 మరియు ఫేస్ బుక్ పేజ్ అందుబాటులో ఉంది.ఇప్పటివరకు 1,850 పిటిషన్ లు అందగా 309 యఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసి చర్యలు తీసుకున్నాం.
•సైబర్ నేరాలను నియంత్రించేందుకు అత్యాధునిక టెక్నాలజీతో సైబర్‌ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చాము.
•రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ కు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం.అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో కూడా రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎన్‌హాన్స్‌మెంట్ వెహికల్స్ (రేస్) విధానం. నిరంతర నిఘా కోసం డ్రోన్‌ల నుండి ప్రత్యక్ష ప్రసారం.
•అన్ని పోలీసు స్టేషన్లకు మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పరికరాలు .ఇప్పటికే అందుబాటులో బాడీవోర్న్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ పరికరాలు.
•స్వల్ప సమయంలో అత్యంత వెనుకబడిన ప్రాంతానికి చేరుకునే విధంగా ఇప్పటికే 3500 వాహనాలను జీపీఎస్ పరికరాలు & స్మార్ట్‌ఫోన్‌లతో అనుసంధానం
•సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఈ సంవత్సరం ఇప్పటికే 37 అవార్డులను దక్కించుకుంది.
•ఇప్పటికే అందుబాటులో బాడీవోర్న్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ పరికరాలు.
• పోలీస్ స్టేషన్, జైళ్లు మరియు గణనలు (ఐసిఎస్) ఇంటిగ్రేషన్. డిజిటల్ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ (డిజిటల్ మొబైల్ రేడియో రిపీటర్లు & మ్యాన్‌ప్యాక్‌లు)
•ఆరు విభాగాల్లో ఏపీ పోలీస్ సేవ’యాప్ 87 రకాల సేవలు
శాంతి భద్రతలు..
♦️నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు
♦️ఎఫ్‌ఐఆర్ స్థితిగతులు, డౌన్‌లోడ్
♦️దొంగతనం ఫిర్యాదులు/ రికవరీలు
♦️తప్పిపోయిన కేసులు /దొరికిన వారు/గుర్తు తెలియని మృతదేహాలు