ఈ 15 జాగ్రత్తలు తీసుకుందాం- కోవిడ్-19పై విజయం సాధిద్దాం
శనివారం, 29 ఆగస్టు 2020 (09:02 IST)
కోవిడ్-19 ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో ప్రజలు కూడా బాధ్యతగా నిత్యం వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన జాగ్రత్తలను తీసుకోవాలి. మన ఆహార అలవాట్లలోనూ మార్పులు చేసుకుని కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవాలి.
త్వరలోనే మార్కెట్లో వాక్సిన్లు వచ్చేస్తున్నాయన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం మన పాటించాల్సిన ముఖ్యమైన 15 జాగ్రత్తలు.
1) దూరం నుంచే పలకరించుకోండి. వారి యోగ క్షేమాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోండి
2) భౌతిక దూరం తప్పక పాటించాలి. ఎదుటి వ్యక్తికి కనీసం ఆరడుగులు లేదా రెండు గజాల దూరంలో ఉండండి
3) బయటకి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కును ధరించాలి. సర్జికల్ మాస్కులు అయితే ఒకసారి వాడిన మాస్కును తిరిగి ఉపయోగించవద్దు. ఇంట్లోనే తయారు చేసుకుని తిరిగి ఉపయోగించుకోగలిగే కాటన్ మాస్కులను వాడండి.
4) మీ కళ్లు, ముక్కు, నోటిని అనవసరంగా తాకకండి. ఎందుకంటే వీటిద్వారానే వైరస్ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.
5) శ్వాసకోశ పరిశుభ్రతలను పాటించండి. తుమ్ము, దగ్గు వచ్చినపుడు మీ మోచిని అడ్డుపెట్టుకోండి. లేదా హ్యాండ్ కర్చీఫ్ ఉపయోగించండి.
6) మీ చేతులను తరచుగా ఆల్కాహాల్ శానిటైజర్ తోగానీ, సబ్బు నీటితో గానీ కనీసం 20 నుంచి 40 సెకన్లపాటు శుభ్రంగా కడుక్కోవాలి.
7) పొగాకు, ఖైనీ, గుట్కా వంటి వాటిని తినవద్దు. బహిరంగంగా ఉమ్మివేయవద్దు.
8) తరచుగా తాకే వస్తువులు ప్రదేశాలు క్రమం తప్పకుండా క్రిమిసంహారకాలతో శుభ్రం చేయండి.