"ఆర్థికమంత్రిగారూ! మీరు శ్వేతపత్రాలు అన్నప్పుడే సాక్షి కథనాల్లా స్పష్టత లేకుండా, ఆధారాలు లేకుండా ఉంటాయని మేము ఊహించాం. వృద్ధి కాగితాల మీద కనిపించింది కానీ ఫీల్డులో కనిపించడం లేదు అన్నారు. అంటే మీ శ్వేతపత్రంలో ఉంది కానీ మీరు ఒప్పుకోనంటారు అంతేగా?
మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖల అభివృద్ధిని వ్యవసాయశాఖ అభివృద్ధిలో ఎలా చూపిస్తారని అడిగారు. ముందుగా ఆ శాఖల అభివృద్ధిని మీరు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. అయితే వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖలను కలిపే జీఎస్ డిపిని లెక్కించడం దేశమంతా ఉంది. మీకది కొత్త విషయం అంతే.