బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం

ఆదివారం, 7 ఆగస్టు 2022 (14:52 IST)
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడుతుంది. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావం కారణంగా ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా వెల్లడించారు. 
 
ఇది క్రమేపీ పశ్చిమంగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఆదివారం ఉత్తరకోస్తాలో ఒకిటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె వివరించారు. 
 
అదేసమయంలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. అటు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు