మంత్రి పవన్ క్యాంపు ఆఫీసులో సీఐ దురుసు ప్రవర్తన

వరుణ్

గురువారం, 27 జూన్ 2024 (14:21 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ క్యాంపు కార్యాలయంలో ఓ ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారు. పవన్ కళ్యాణ్ వారాహి పూజ చేస్తుండగా బూట్లతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో క్యాంపు కార్యాలయ సిబ్బంది వారించినప్పటికీ ఆయన పట్టించుకోకుండా వారిపట్ల దురుసుగా ప్రవర్తించాడు. అపాయింట్‌మెంట్ లేకున్నా నేరుగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని సిబ్బంది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ సీఐపై బదిలీవేటు వేశారు. 
 
ఆ ఎస్ఐ పేరు శ్రీనివాసరావు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టరుగా పని చేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వంలోనూ ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో ఇదేవిధంగా ప్రవర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే తనిఖీలు కూడా చేశారు. తాజాగా ముందస్తు అనుమతి తీసుకోకుండా భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నా ఆగకుండా నేరుగా లోపలికి వెళ్లారు. 
 
ఓ వైపు పవన్ వారాహి పూజ చేస్తుండగా, బూట్లతోనే లోనికి వెళ్ళారు. భద్రతా సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా సదరు సీఐని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అతని స్థానంలో త్రిపురాంతకం సీఐ వినోద్ కుమార్‌ను మంగళగిరి టౌన్ సీఐగా నియమిసూ గుంటూరు రేంజ్ ఐసీ సర్వశ్రేష్ఠత్రిపాఠి ఆదేశాలు జారీచేశారు. 
 
తకాగా, సీఐ శ్రీనివాసరావు గతంలోనూ ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించారు. జనసేన కార్యాలయంలో పని చేసే సిబ్బంది నివసించే భవనాలు, కార్యాలయంలో తనిఖీల పేరుతో హడావుడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు