లే ఔట్‌ ఫీజులు చెల్లించని లింగమనేని : ఎమ్మెల్యే ఆళ్ళ

శనివారం, 6 జులై 2019 (13:22 IST)
ఐజెఎం లింగమనేని అక్రమాలు మంగళగిరిలో 40 ఎకరాలు తీసుకున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ఇదేఅంశంపై ఆయన మాట్లాడుతూ, 2005-2006 నుండి విల్లాలు నిర్మించి ఒక్కొక్క విల్లను 6 కోట్లకు అమ్ముకుని, లే ఔట్ ఫీజులు చెల్లించలేదు. 12 లక్షలు ఇప్పటివరకు చెల్లించలేదు. సుమారుగా 50 నుండి 60 కోట్లు ఎగవేశారని ఆరోపించారు.
 
వ్యవస్థను పూర్తిగా పక్కదారిపట్టించి వాళ్ళ జేబులు నింపుకున్నారు. చట్టవ్యతిరేకమైన పద్ధతిలో వాళ్ళు వేరే వాళ్లకు మార్పిడి చేసుకోవడం ఇన్ని అక్రమాలు చేశారు. విజలన్స్ దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతాను.250 కోట్లరూపాయలవిలువైన ఆస్తులను అప్పనంగా కొట్టేసిన ఈ లింగమనేని రమేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు కాపాడుకుంటువస్తున్నారు.దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు