ఓ యువతితో సహజీవనం.. మరో యువతితో పెళ్లి.. వరుడికి దేహశుద్ధి.. ఎక్కడ?

ఆదివారం, 14 మే 2017 (15:52 IST)
ఓ యువతితో ఐదేళ్ల సహజీవనం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన వ్యక్తికి తగిన శాస్తి జరిగింది. పెళ్ళికి కాసేపుండగా వరుడి ప్రేయసి ఇచ్చిన మెసేజ్‌తో వరంగల్ జిల్లా హన్మకొండలో పీటలపై పెళ్లి ఆగిపోయింది. విజయవాడకు చెందిన శ్రీనివాస్ మట్టెవాడకు చెందిన యువతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ పెళ్లి వేడుక అట్టహాసంగా జరుగుతోంది. ఇంకొద్ది సేపట్లో తాళికట్టాల్సివుంది. 
 
ఇంతలో వధువు ఫోన్‌కు వరుడి లవర్ మేసెజ్ పంపింది. ప్రేమ పేరిట తనను మోసం చేశాడని యువతి మేసేజ్‌లో పేర్కొంది. ఆ మేసెజ్‌ను చదివిన వధువు పెళ్లికి నిరాకరించింది. సుబేరీది పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో వరుడితో పాటు బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లికి కాసేపుండగా వధువు బంధువులు వరుడిని నిలదీశారు. ఆపై దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 
 
ఒకరితో ప్రేమాయణం మరొకరితో పెళ్లికి సిద్ధమైన శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కట్నంగా తామిచ్చిన 15లక్షలను శ్రీనివాస్ నుంచి తిరిగి ఇప్పించాలని వధువు తరపు వారు పోలీసులను కోరారు.

వెబ్దునియా పై చదవండి