ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఆందోళన బాటపట్టిన ఉద్యోగులు తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సోమవారం అమరావతిలోని ఎన్జీవో హోంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పీఆర్సీ సాధన సమితి నేతల పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణపై వైద్య ఆరోగ్య శాఖలో ఏ విధంగా అమలు చేయాలన్న అంశంపై చర్చిస్తున్నారు.
వచ్చే నెల 7వ తేదీ నుంచి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా సమ్మెకు వెళ్లాలా వద్దా అనే అంశంపై తర్జన భర్జన చెందుతున్నారు. మిగిలిన ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం ఒక ఎత్తు అయితే, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వెళ్లడం మరో ఎత్తు అవ్తుంది. అత్యవసర సేవలకు విఘాతం కలిగితే పేషంట్లు మరణిస్తే వైద్య ఆరోగ్య శాఖనే ప్రధాన దోషిగా నిలబెడతారని వైద్య శాఖ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.