కరోనాపై యుద్ధం : సత్య నాదెళ్ల అర్థాంగి భారీ విరాళం.. హీరో నితిన్ కూడా

మంగళవారం, 24 మార్చి 2020 (17:58 IST)
ప్రపంచం కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకుంది. ఈ వైరస్ భూతం ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఈ వైరస్ కోరల్లో అగ్రరాజ్యాలు చిక్కుకున్నాయి. అన్ని దేశాలు కలిసి ఈ వైరస్‌పై అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం యుద్ధం చేస్తోంది. అయినప్పటికీ.. ఇప్పటివరకు సరైన మందును కనిపెట్టలేకపోయారు. 
 
ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటానికి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అర్థాంగి అనుపమ భారీ విరాళంతో ముందుకొచ్చారు. కరోనా నివారణకు అనుపమ రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని అనుపమ తండ్రి తెలంగాణ సీఎం సహాయనిధికి అందించారు. ఈ మొత్తాన్ని అనుపమ తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ సీఎంకు అందజేశారు.
 
అలాగే, టాలీవుడ్ హీరో నితిన్ కూడా తనవంతు సాయం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ నియంత్రణకు తన వంతు భాగస్వామ్యం కింద ఆయా రాష్ట్రాలకు పది లక్షల చొప్పున విరాళంగా హీరో నితిన్ ప్రకటించారు. ఈ చెక్కును ఆయన స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. 
 
తెలంగాణ ఉద్యోగులు, టీచర్ల ఒక రోజు బేసిక్ శాలరీని విరాళం కింద ఇచ్చారు. విరాళాలు అందజేసిన వారికి సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తన ధన్యవాదాలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు