ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లు వీళ్లకే వస్తాయంటున్న మంత్రి నాదెండ్ల మనోహర్

ఐవీఆర్

శుక్రవారం, 25 అక్టోబరు 2024 (15:24 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నట్లు కూటమి ప్రభుత్వం తెలియజేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... '' డిసెంబర్ 29న 10 గంటల నుంచి బుకింగ్స్ చేసుకోవచ్చు. 31 తేదీ నుంచి డెలవరీ చేస్తాము. అర్హత వున్నవారు బుక్ చేసుకోగానే వారికి సందేశం వస్తుంది. 3 ఆయిల్ కంపెనీలతో మేము చర్చించాము. సిలిండర్ బుక్ చేసుకున్నవారికి 24 గంటల నుంచి 48 గంటల లోపుగా డెలివరీ అవుతుందని చెప్పారు.
 
ఉచిత సిలిండర్ పొందేందుకు వుండాల్సిన అర్హతలు ఏమిటి అని మిత్రులు అడిగారు. ఎల్‌పిజి కనెక్షన్ వుండాలి. తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డ్ వుండాలి. ఈ 3 వుంటే చాలు. ఈ వివరాలను ఆయిల్ కంపెనీలతో అనుసంధానం చేస్తాము. వినియోగదారుడు బుక్ చేసుకోగానే ప్రభుత్వం నుంచి వారి మొబైల్ ఫోనుకి సందేశం వస్తుంది. అలా వచ్చిన తర్వాత వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి'' అని చెప్పారు.

ఈ నెల 29 నుంచి ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు - శ్రీ నాదెండ్ల మనోహర్ గారు @PawanKalyan @JanaSenaParty @mnadendla pic.twitter.com/gIJ4h2gzGB

— Prasannakumar Nalle (@PrasannaNalle) October 25, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు