అమెరికా పర్యటనకు నారా లోకేష్.. ఇది సరైన సమయం కాదేమో?

సెల్వి

శుక్రవారం, 25 అక్టోబరు 2024 (10:44 IST)
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆహ్వానించేందుకు మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. తదుపరి 10 రోజుల పాటు అమెరికాలో లోకేష్ పర్యటిస్తారు. వ్యాపారులను ఆకర్షించడానికి టెస్లా, గూగుల్, మెటా వంటి అనేక ప్రసిద్ధ కంపెనీల ప్రతినిధులను నారా లోకేశ్ కలవనున్నారు.
 
రాష్ట్రానికి పలు కంపెనీలను తీసుకొచ్చేందుకు ఆయన ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల, వైజాగ్‌లో టిసిఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్‌తో చర్చలు జరిపారు. పెట్టుబడులకు సంబంధించి తమిళనాడుకు చెందిన శివనాడార్ కంపెనీ, జపాన్ అంబాసిడర్లతో కూడా లోకేష్ మాట్లాడారు.
 
ఏది ఏమైనప్పటికీ, వచ్చే నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను నేపథ్యంలో నారా లోకేష్ అమెరికా పర్యటన చేపట్టడం ఇది సరైన సమయం కాదని నెటిజన్లు, రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల దృష్ట్యా, పెట్టుబడిదారుల దృష్టితో సహా అందరి దృష్టి పోల్ ఫలితాలపైనే కేంద్రీకృతమై ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు