అమరావతి నిర్మాణానికి స్పీడు బ్రేకర్లుగా మారుతున్న అధికారులు, మంత్రి నారాయణ తీవ్ర అసహనం

ఐవీఆర్

గురువారం, 5 డిశెంబరు 2024 (19:35 IST)
Andhra Pradesh Capital Amaravati ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. ఈ నగర నిర్మాణాన్ని రానున్న మూడేళ్లలోపుగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకున్నది. ఐతే ఈ పనులు చకచకా పూర్తి కావాలంటే ప్రభుత్వ యంత్రాంగం పనితీరు మెరుగ్గా వుండాలి. ఐతే కీలక పదవుల్లో వున్న అధికారులు ఏవో సాకులు చెబుతూ అనుకున్న సమయానికి మంత్రులకు అందుబాటులో వుండటంలేదట.
 
తమకు కేటాయించిన పేషీల్లో కాకుండా వేరో ఎక్కడో వెళ్లి కూర్చుంటున్నారట. వారిని వెతుక్కుంటూ వెళ్లి రాష్ట్రాభివృద్ధికై చేయాల్సిన పనులు గురించి చర్చించటం మంత్రులకు తల ప్రాణం తోకకి వస్తుందట. ఈ విషయాన్ని వారు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదులు చేస్తున్నారట. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమరావతి రాజధాని నగరాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయాల్సి వుండగా అధికారులు ఇలా బద్ధకంగానూ, తప్పించుకుని తిరగడం చర్చనీయాంశంగా మారుతోంది.
 
దీనితో అసలు ఈ అధికారులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, వెనుక ఎవరి ఒత్తిడి ఏమైనా పనిచేస్తుందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. మొత్తమ్మీద వచ్చే వారంలో ఎవరెవరు బద్ధకస్తులైన అధికారులు వున్నారో వారికి ఉద్వాసన పలికే అవకాశం వుందని చర్చ సాగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు