చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలను ఎంపీ విజయ సాయి రెడ్డి తెలియజేశారు. ప్రజా సేవలో చురుగ్గా పాల్గొనే మీరు భగవంతుని కృపతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. చెవిరెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా సాగాయి. తుమ్మలగుంట ఎమ్మెల్యే చెవిరెడ్డి నివాసం వద్ద వేకువజాము నుంచే పార్టీ శ్రేణులు తాకిడి నెలకొంది.
ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు, శ్రేయోభిలాషులు, అధికారులు తరలివచ్చారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా నలుమూలల నుంచి పలువురు విచ్చేసి ఎమ్మెల్యే చెవిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆశీర్వాదం అందుకున్నారు.
అనంతరం తుడా వీసీ హరికృష్ణ, సెక్రటరీ లక్ష్మీ, పీఓ శ్రీనివాసులు రెడ్డి, సిబ్బంది తుమ్మలగుంట కు తరలివచ్చారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి కి పుషగుచ్చం అందించి దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలోని ఎంపిడిఓ, తహశీల్దార్ లు, పోలీస్ శాఖ అధికారులు విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని అన్ని పంచాయతీలలో పార్టీ నేతలు విరివిగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పలు చోట్ల రక్తదాన కార్యక్రమాలను చేపట్టారు. పాకాలలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.
చెవిరెడ్డికి ప్రేమతో తమ్ముడు చెవిరెడ్డి రఘునాథ రెడ్డి, రైస్ కిషోర్ ఆధ్వర్యంలో 175 కిలోల డ్రై ఫ్రూట్ తో తయారు చేయించిన భారీ కేక్ ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కట్ చేశారు. ముందుగా తల్లి దండ్రులకు తినిపించి వారి ఆశీర్వాదం అందుకున్నారు.