ఒక అమ్మాయికి సలహా ఇచ్చి చివరకు తన కుటుంబాన్ని రోడ్డుపైకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఏర్పడింది. శ్రీరెడ్డి రోడ్డుపైకి వచ్చి అర్థనగ్నంగా నిరసన వ్యక్తం చేస్తూ తనను సలహా అడిగినందుకు నీవద్ద ఆధారాలుంటే పోలీస్టేషన్‌కు వెళ్ళు... న్యాయం ఖచ్చితంగా జరుగుతుందన్న మాటను చెప్పాడు పవన్ కళ్యాణ్. ఇది కాస్తా శ్రీరెడ్డికి బాగా చిర్రెత్తుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే మొత్తం సినిమాను తెర వెనుక నుంచి నడిపించారు రాంగోపాల్ వర్మ.
శ్రీరెడ్డికి డబ్బులిచ్చి మరీ పవన్ కళ్యాణ్‌ను రోడ్డుపైకి లాగమని తనే చెప్పినట్లు ఒప్పుకున్నాడు కూడా. దీంతో శ్రీరెడ్డి ఏకంగా పవన్ కళ్యాణ్ తల్లినే రోడ్డుపైకి లాగేసింది. ఒక తల్లిని మీడియాలో రాయలేని భాషతో బూతులు తిట్టింది. దీంతో పవన్ కళ్యాణ్ మొదట్లో సైలెంట్‌గా ఉన్నా ఆ తరువాత మాత్రం ఈ మొత్తం వ్యవహారం వెనకాల రాంగోపాల్ వర్మ ఉన్నారన్న విషయం తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయారు.
ఫిల్మ్ ఛాంబర్‌కు వెళ్ళి నానా రభసా చేశారు. పవన్ కళ్యాణ్‌కు వేలమంది అభిమానులు బాసటగా నిలిస్తే కొంతమంది సినీ ప్రముఖులు కూడా అండగా ఉన్నారు. తాజాగా సినీ నటి రోజా కూడా పవన్ కళ్యాణ్‌కు అండగా నిలబడ్డారు. సలహా ఇచ్చిన పవన్ కళ్యాణ్‌ను అనవసరంగా శ్రీరెడ్డి రోడ్డుపైకి లాగిందని ఈ విషయం చాలా బాధకరమని చెప్పింది రోజా. అంతేకాదు బాలక్రిష్ణ ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోతుంటే చంద్రబాబునాయుడు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు రోజా. పవన్ కళ్యాణ్‌కు ఒక న్యాయం.. బాలక్రిష్ణకు మరో న్యాయమా అంటూ ప్రశ్నించింది. ధర్నాలు, రాస్తారోకోల వల్ల హోదా రాదన్న మీరు సైకిల్ యాత్రలు చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా అని టిడిపి నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు రోజా.