ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇది ఆదివారం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, యానాం తదితర ప్రాంతాల్లో పడమర గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పడమర గాలుల ప్రభావం ఉంది. ఫలితంగా కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురవడంతోపాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వివరించింది.