వివాహం అంటే ఒళ్లు మోయలేనంత ఆభరణాలు.. బరువైన దుస్తులు.. ఆకర్షించే మేకప్‌తో వధువు కనిపిస్తుంది. కానీ ఓ పంజాబీ వధువు చేసిన పని ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆమె పొట్టి దుస్తులతో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యింది. అందమైన లెహంగాను ధరించాల్సిన ఆ వధువు ఎవరూ ఊహించని విధంగా ఓ పొట్టి డ్రస్సుతో వచ్చేసింది.
సంప్రదాయ వధువు ధరించే చోలీ, బంగారు ఆభరణాలు, దుప్పట్టాలను వేసుకుని లెహంగా స్థానంలో నైకీ బ్లాక్ షార్ట్స్‌తో వచ్చి పెళ్లిలో పాల్గొంది. వరుడి ముందు అలాగే తిరిగి, అతని మెడలో వరమాల వేసింది. కొంతమంది ఆమె చేసిన పనిని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం ఆమె డ్రెస్‌పై ఫైర్ అవుతున్నారు. సంప్రదాయంగా జరిగే పెళ్లిలో ఇలాంటి దుస్తులు ధరించడం ఏంటని మండిపడుతున్నారు.