ఏపీలో రూ.13,375 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సెల్వి

బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (19:33 IST)
ఆంధ్రప్రదేశ్ విద్యారంగాన్ని మెరుగుపరచడానికి వికాసిత్ భారత్ చొరవలో భాగంగా మొత్తం ఐదు ప్రధాన సంస్థలను ప్రధాని మోదీ ప్రారంభించారు.
 
వైజాగ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, కర్నూలులోని ఐఐటీడీఎం (డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్) చాలా ముఖ్యమైనవి. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, శ్రీసిటీ ఐఐఐటీ శాశ్వత క్యాంపస్‌ను మోదీ ప్రారంభించారు.
 
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. మొన్నటికి మొన్న 36 ప్రాజెక్ట్‌లను వర్చువల్‌గా మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.13,375 కోట్లకు చేరుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు