లేటుగా నైరుతి రుతుపవనాలు.. ఒక్కసారిగా మారిన వాతావరణం

సోమవారం, 13 జూన్ 2022 (14:24 IST)
నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి రావాలా వద్దా అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. అయితే తాజాగా విశాఖపట్నంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

దట్టమైన మేఘాలు అలముకోవడంతో ఉరుములు, మెరుపులతో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. 
 
ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖలో దిగాల్సిన విమానాలను హైదరాబాద్‌కు మళ్లించారు. ఢిల్లీ నుంచి విశాఖ రావాల్సిన ఓ విమానాన్ని అధికారులు వెనక్కి మళ్లించారు. 
 
ఈ విమానంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ ఉన్నారు. ఇక, ఢిల్లీ విమానం రాకపోవడంతో మరో కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ పూరీ విశాఖలోనే నిలిచిపోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు