జీతం తీసుకుంటున్నారు.. జనాన్ని గుర్తు పెట్టుకోండి: బాబుపై విజయసాయి ఫైర్

బుధవారం, 3 జులై 2019 (15:19 IST)
ఎన్నికలకు ముందు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్న వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్వీట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్షనేత ఇంకా నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే ఆయన ధైర్యానికి జోహార్లని విజయసాయి ఎద్దేవా చేశారు.
 
విత్తనాల సేకరణకు రూ.380 కోట్లు విడుదల చేయాలని ఫిబ్రవరిలో ఏపీ సీడ్స్ కార్పోషన్ కోరితే ఆ నిధులను ఓటర్ల ప్రలోభాలకు మళ్లించారు. పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపుతో బురిడీ కొట్టించడానికి రూ.30 వేల కోట్లు మాయ పేలాలు చేశారు. ఇంకా నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే మీ ధైర్యానికి జోహార్లని వ్యాఖ్యానించారు. 
 
ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను గాలికొదిలి తన సౌకర్యాల గురించి పోరాడుతున్నారు. 
ప్రభుత్వానికి రాసిన మొదటి లేఖలో ప్రజావేదికను కేటాయించాలని కోరారు. తనకు భద్రత పెంచాలని ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. వేతనం తీసకుంటున్నందుకైనా ప్రజలను కాస్త గుర్తు పెట్టుకోండి బాబూ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు