మున్సిపల్ కార్మికులకు పని వేళలు ఉండ‌వా? అర్ధ‌రాత్రి అప‌రాత్రి లేదా?

సోమవారం, 6 సెప్టెంబరు 2021 (12:07 IST)
రాష్ట్రంలో మున్సిప‌ల్ కార్మికుల‌కు ప‌నివేళ‌లు లేవ‌ని, అర్ధ‌రాత్రి, అప‌రాత్రి అని లేకుండా ఎపుడు ప‌డితే అపుడు ప‌నులు చేయిస్తున్నార‌ని కార్మిక సంఘాలు క‌న్నెర్ర చేస్తున్నాయి.
 
కాకినాడ నగరపాలక సంస్థ లో పనిచేస్తున్న కార్మికులకు డ్యూటీ ఏ టైం కి ప్రారంభంచాలి? అలాగే ఎప్పుడు ముగించాలో అధికారులకు, సానిటరీ ఇన్స్పెక్టర్ లకు కూడా క్లారిటీ లేదని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు తాటిపాక మధు విమర్శించారు.
 
ఈ ఉదయం 1 వ సర్కిల్ లో వద్ద వార్డు మున్సిపల్ కార్మికుల సమావేశం యూనియన్ నాయకులూ సూర్యప్రకాష్ ,బొబ్బిలి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అథితిగా పాల్గొన్న మధు మాట్లాడుతూ, మున్సిపల్ కమిషనర్ ప్రతి సర్కిల్ లో పనివేళలు పట్టిక నోటీసు బోర్డులో పెట్టాలని డిమాండు చేశారు. చాలా మంది ఇన్సపెక్టర్స్ కార్మికులను వెట్టి చాకిరీ రూపంలో పని చేయిస్తున్నారని,  ఉదయం మస్తరు టైం లో 5 నిమషాలు లేట్ అయినా వెనక్కి పంపిస్తున్నారని ఆరోపించారు. అదే పని ముగింపులో మాత్రం 10 .౩౦ నుండి 12 గంటల వరకు పని చేయిస్తున్నారని అన్నారు. సాయంత్రం కూడా అలాగే ఉందని అన్నారు. వారానికి సెలవు ఆదివారం ఒక పూట, బుధవారం ఒక పూట ఇవ్వడం వల్ల కార్మికులు తమ‌ స్వంత పనులు చేసుకునే స్వేచ్ఛ లేదని అన్నారు. ఏదో ఒక రోజు పూర్తిగా వారాంతపు సెలవు ఇవ్వాలని మధు డిమాండ్ చేసారు .
 
ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పీస్ నారాయణ మాట్లాడుతూ కార్మికుల‌కు జ్వరం వచ్చినా సెలవు ఇవ్వలేని వ్యవస్థ నగరపాలక సంస్థల‌లో ఉందని అన్నారు. కార్మికుల‌కు క్యాజువ‌ల్ లీవ్ లు ఉన్నా అధికారులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు కవుల సత్యనారాయణ, శ్రీను, నగేష్, సూర్యకుమార్, గంట లాజర్, తదితరులు పాల్గున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు