నా అరెస్ట్ అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం.. చంద్రబాబు నాయుడు

శనివారం, 9 సెప్టెంబరు 2023 (12:08 IST)
తెలుగుదేశం పార్టీ (టిడిపి) అగ్రనేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తన అరెస్టు అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని శనివారం అన్నారు. నంద్యాల జిల్లాలో అవినీతి నిరోధక చట్టం కింద రాష్ట్ర సిఐడి అరెస్టు చేసిన సమయంలో, "అధికారులు ప్రాథమికంగా తప్పు చేసినట్లు లేదా కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు చూపడం లేదు" అని నాయుడు అన్నారు.
 
"నేను ప్రజల సమస్యలను లేవనెత్తుతున్నందున నన్ను టార్గెట్ చేస్తున్నారు" అని నాయుడు పేర్కొన్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావడంతో ఆంధ్రప్రదేశ్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.
 
రాష్ట్రం కోసం ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండాలని, ఈ దుర్మార్గపు పాలనను ఎదుర్కోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను స్థిరమైన జీవితాన్ని గడిపానని, 45 ఏళ్లలో తనపై దావా వేయడానికి ఎవరూ సాహసించలేదని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి రుజువులు లేదా ఆధారాలు లేవని నాయుడు పేర్కొన్నారు.
 
దివంగత ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనపై అనేక కేసులు పెట్టినా ఎలాంటి నష్టం జరగలేదన్నారు. తాను ఎప్పటికీ రాజీపడబోనని, న్యాయం జరిగే వరకు తన యాత్ర కొనసాగుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్యాయం చేసేవారిని కాలగర్భంలో సమాధి అవుతారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు