తమ అందరి సమక్షంలో బాలకృష్ణకు కాల్ చేయండని రోజాను అనసూయ కోరింది. అయితే, బాలకృష్ణ ఈ సమయంలో మంచి మూడ్లో ఉంటే ఓకే. లేకపోతే ఎలా? అని రోజా ప్రశ్నిస్తూనే ఫోన్ చేసింది. బాలయ్య ఫోన్ ఎత్తారు. దీంతో 'హలో సర్.. బాగున్నారా?' అని రోజా పలకరించారు. బదులిస్తూ 'రోజాగారు నమస్కారం' అన్నారు బాలకృష్ణ. తాను బాగున్నానని, మన అఖండ షూట్లో ఉన్నానని ఆయన చెప్పారు.
మళ్లీ మనిద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేద్దామని బాలయ్యను రోజా ప్రశ్నించారు. 'భైరవద్వీపం పార్ట్ 2 చేద్దామా? లేక బొబ్బిలిసింహం పార్ట్ 2 చేద్దామా?' అన్నారు రోజా. దానికి బాలయ్య నవుడుతూ, తమ కాంబినేషన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారని చెప్పారు. జబర్దస్త్ ప్రోగ్రాంకు జడ్జీగా తాను వస్తానని బాలకృష్ణ అనడంతో అందరూ ఖుషీ అయ్యారు.