దత్తత తీసుకున్న గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే రోజా

సోమవారం, 17 జనవరి 2022 (12:12 IST)
చిత్తూరు జిల్లా నగరి రూరల్ వికెఆర్ పురం పంచాయితీలోని మీరాసాహెబ్ పాలెం గ్రామంను ఎమ్మెల్యే రోజా దత్తత తీసుకున్నారు. దీన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో త‌ర‌చూ ఈ గ్రామాన్ని సంద‌ర్శించి, బాగోగులు ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. 
 
 
మోడ‌ల్ విలేజ్ లో భాగంగా గ్రామంలోని అన్ని వీధులకు, లోపల, బయట వచ్చి వెళ్ళే దారులలో మొత్తం కలిపి 620 మీటర్లు (10 అడుగుల  వెడల్పు రోడ్) ను తన సొంత నిధులు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంచనా విలువ 23.00 లక్షల రూపాయల‌తో నిర్మించనున్న సిమెంట్ కాంక్రీట్ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప‌నుల‌ను మిక్చ‌ర్ లో గ్రావెల్ వేసి ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. గ్రామానికి ఒక పెద్ద దిక్కులా వుండి గ్రామ బాగోగులను చూస్తున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా కి జీవితాంతం ఋణపడి ఉంటామని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు