సాంబారు పాత్రలో పడి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి.. నల్గొండలో దారుణం

శనివారం, 24 డిశెంబరు 2016 (12:05 IST)
సాంబారు పాత్రలో పడి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం సమయంలో సాంబారు పాత్రలో పడి గాయపడిన విద్యార్థి శనివారం మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈదులూరు గ్రామానికి చెందిన బల్కూరి జయవర్ధన్(5) ఒకటో తరగతి చదువుతున్నాడు. 
 
శుక్రవారం మధ్యాహ్న భోజనం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులంతా వరుసలో నిలుచున్నారు. ఈ క్రమంలో వెనుకనున్న విద్యార్థులు తోసుకోవడంతో ముందున్న జయవర్ధన్ వేడి సాంబారు ఉన్న పాత్రలో పడిపోయాడు. దీంతో తీవ్రగాయాలైన ఆ విద్యార్థిని విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. పరిస్థితి విషమించడంతో నల్గొండ ప్రభుత్వాసుపత్రి నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం విద్యార్థి మృతి చెందాడు.

వెబ్దునియా పై చదవండి